''కథాసుధ''లో వచ్చిన వ్యాసాల్లో 70 వ్యాసాలను మాత్రం ఎంపిక చేసి విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారు ''మా మంచి తెలుగు కథ'' అనే పేరుతో కథా వ్యాస సంపుటిగా వెలువరించారు.

''కథాసుధ'' వ్యాసాల్లో అలనాటి కథకుల గురించి రాసిన వ్యాసాలను మొదలుకొని నేటి కథకుల గురించి రాసిన వ్యాసాల వరకూ ఎన్నో తరహాల దృక్పథాలు, శిల్ప విన్యాసాలు గల కథల గురించి చెప్పడం జరిగింది.

ఈ వ్యాస సంపుటిలో వెనుకటితరం కథకుల కథలపై రాసిన వ్యాసాలు తక్కువ సంఖ్యలోనూ మలితరం కథలపై రాసిన వ్యాసాలు ఎక్కువ సంఖ్యలోనూ దర్శనమిస్తాయి. ఆ రకంగా చూచినప్పుడు సమకాలీన తెలుగు కథ నడుస్తున్న తీరును సాధారణ పాఠకులు అవగాహన చేసుకునేందుకు ఈ సంపుటిలోని వ్యాసాలు ఉపకరిస్తాయి.

- కోడూరి శ్రీరామమూర్తి

Write a review

Note: HTML is not translated!
Bad           Good