కులం, వర్గం, జాతి లక్షణాలను, శీలస్వభావాలను లోతుగా ఆకళింపు చేసుకున్న రచయిత చాసో. ఆయన కథలు మానవశీల స్వభావ శాస్త్రాన్ని (ఈథోలజీ) జనజీవనం నుండి అధ్యయనం చేసి రాసినవి.

    సాంస్కృతిక ఈథోస్‌ ఆయన గుండె నిండా నిండి ఉంది. ఈ సాంస్కృతిక ఈథోస్‌ వల్ల ఆయన కథల్లో మాండలిక పదాలు, నుడికారం, పలుకుబళ్లు ఎంతో సహజంగా జీవిత సత్యాలను, సామాజిక సత్యాలను వెల్లడించాయి. ఆ భాషా సంపదతో చాసో తన కథకే ఓ యాసని ఇవ్వగలిగారు.

    భాషా సంస్కృతులు మొత్తం ఆంధ్రదేశం అంతటివీ అయినప్పటికీ ప్రాంత ప్రాంతానికి పలుకుబడిలో తేడా ఉంటుంది. విజయనగరం ప్రాంతపు భాషా సౌందర్యం తెలుగుజాతి అంతటికీ చెందిన తెలుగు సంపద. ఇక్కడి పలుకుబడి సొగసుని మిగిలిన ప్రాంతాలకి తెలియచేసి సాంస్కృతిక సమైక్య చైతన్యాన్ని ఆహ్వానించే ఉద్దేశ్యంతో ఈ సాంస్కృతిక పదకోశం రూపొందించబడింది. - చాగంటి తులసి

Write a review

Note: HTML is not translated!
Bad           Good