చలం నిరంతర చలనం. కాలాన్ని జయించిన ఖడ్గ చాలనం. కుళ్ళును, కఠిన్యాన్ని, హిపోక్రసీని, దైన్యాన్ని, దాస్యాన్ని కుహనా విలువలను, దాపరికాన్ని, నిజాయితీలేని ప్రేమలను నిక్కచ్చిగా, నిస్కర్షగా పరిధులు పరిమితులు లేకుండా అక్షరసునామీతో ధిక్కరించాడు. రాతకు, చేతకు మధ్య నిజాన్ని రిజేశాడు. స్త్రీకి బాహ్య ప్రపంచం నుంచే కాదు, అంతరలోకాల నుంచీ స్వేచ్ఛ కావాలని తపించాడు. కాల ప్రయాణంలో స్త్రీ మరింత దైన్యంలోకి నెట్టివేయబడుతుందని ఆనాడే చెప్పాడు.

వందేళ్లు కాదు, మరో వందేళ్లు గడిచినా చలం సాహిత్యానికి ఆదరణ తగ్గదనడానికి ఉత్తరాలే ప్రత్యక్ష ఉదాహరణ. ఆలోచనల్లోనే కాదు చేతల్లోనూ తనదైన సాహితీ సువాసనలతో పరిమళించే డా||అరుణజ్యోతి ...చలం డా|| కామేశ్వరికి రాసిన ఉత్తరాలను ప్రచురించడమే ఇందుకు సాక్ష్యం.

Pages : 102

Write a review

Note: HTML is not translated!
Bad           Good