ఈ పుస్తకంలో తెలుగులో మొదటిసారిగా అధిక్షేపం అనే సాహిత్య శాఖకు సంబంధించిన సమగ్ర స్వరూపం చిత్రితమైంది. తిట్టు, పరిహాసం, అపహాస్యం, నిరసన, ఈసడింపు, సినిసిజం అనే ఆరు అవతారాలు కనిపిస్తాయి.

ఈ శాఖకు హాస్యంతో, వ్యంగ్యంతో, ఐరనీతో ఉన్న సంబంధ బాంధవ్యాల విశ్లేషణ ఉంది.

కందుకూరి వీరేశలింగం గారి కాలం నుంచి 1980 వరకూ తెలుగు రచయితలు నాటకాల్లో, ప్రహసనాల్లో, నవలల్లో, కథల్లో, వ్యాసాల్లో, కవిత్వంలో రాశిపోసిన అధిక్షేపం గురించిన సంవీక్షణం ఉంది.

వాళ్లు ఏఏ విషయాలను, ఆచారాలను, వ్యవస్థలను, వ్యక్తులను, ప్రవృత్తులను, అధిక్షేపించారో ఆ విశేషాలు ఉన్నాయి,..

వాటినన్నింటినీ వెక్కిరించడానికి వాళ్లు పన్నిన వ్యూహాలున్నాయి. అన్యాపదేశం, పేరడీ, బర్‌లెస్క్‌, విప్రతీపం, ఫ్యూచరాలజీ, పాత్ర వంటి ఆసక్తికరాలైన అధిక్షేప సాథనాల సోదాహరణ వివరణ ఉంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good