ఈ సంపుటిలోని వ్యాసాలన్నీ చదవదగ్గవి. ప్రత్యేకించి నాకు మరీ నచ్చిన వాటిలో వేమనపై రాసినవి. వీరబ్రహ్మం, పుట్టపర్తి, రారా, విద్వాన్‌ విశ్వంలపై రాసినవి ప్రస్తావించాలి. ఎందరో యింతకుముందు రాసినా, రాయలసీమ వాసిగా, శశిశ్రీ బ్రౌన్‌, రేనాటి చోళులపై రాసిన వ్యాసాలకు, సరైన న్యాయం చేశాడు రచయిత. పత్రికారంగాన్ని గూర్చి రాసిన 'మారుతున్న విలువల్లో పాత్రికేయం'లో ఆ రంగంలో యివ్వాళ మనం చూస్తున్న వెలుగునీడలను నిష్పాక్షికంగా వివరించాడు. ఇక, ఆఖరు వ్యాసం, రచయిత రహమ్‌తుల్లా - శశిశ్రీగా మారిన వైనం ఆసక్తికరంగానే కాక, నేటి సామాజిక వివక్షలపై కొరడా ఝళిపించినట్లుంది. పుట్టపర్తి మ¬న్నతవ్యక్తిత్వాన్ని యీవ్యాసంలో చూస్తాం. - వకుళాభరణం రామకృష్ణ

ఈ వ్యాస సంపుటిలో 19 వ్యాసాలున్నాయి. ఇందులో వ్యక్తులైన రచయితల గురించీ, పలు అంశాలపై సందర్భానుసారం రాశాను. వ్యక్తులైతే - వ్యవస్థీకృత మూర్తులైనప్పుడే వారిపై వ్యాసాలుగా రాశాను. చరిత్ర, సాహిత్యం, పాత్రికేయం, రాజకీయం ఇలా అంశాలపై కవిగా, రచయితగా, పాత్రికేయునిగా నిబద్దంగా రాశాను - శశిశ్రీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good