ఇవాళ మనదేశంలో అత్యంత చర్చనీయాంశంగా వున&్న విషయాలలో లౌకికవాదమొకటి. మన దేశంలో అనేకులు లౌకికవాదమనేది నానాటికీ కనుమరుగయి పోతున్నదని ఆవేదన చెందుతూ వుంటే - కొంతమంది అదొక పాశ్చాత్య భావన, మనకు సంబంధించింది కాదు అంటున్నారు.

ఇట్లాంటి స్థితిలో - లౌకికవాదం అంటే ఏమిటి? దానిని అమలు చెయ్యడం ఎందుకు? ఇది పాశ్చాత్య భావన మాత్రమేనా, మనకు సంబంధించింది కాదా? ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానం యిచ్చే గ్రంధమిది.

తాజ్‌మహల్‌ ముస్లిమ్‌ల కట్టడం కాబట్టి భారతదేశంలో అది దర్శనీయ స్థలం కాదనీ, శ్రీరాముడు పుట్టిన ఊరు కాబట్టి అయోధ్య దర్శనీయ స్థలమనీ వితండవాదం చేసేవారు పెరిగి పోతున్న ఈ రోజులలో నిస్పాక్షిక దృక్పధం గల పాఠకులు తప్పక చదవవలసిన గ్రంథమిది.

ప్రముఖ రచయిత, గాంధేయవాది, అయిన కోడూరి శ్రీరామమూర్తి ఎన్నో గ్రంథాలను పరిశోధించి, ఎన్నో వాస్తవాలను గమనించి రాసిన గ్రంథమిది.

పేజీలు : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good