గుండెలు ఝల్లుమనే వేగంతో వచ్చి, సడన్‌ బ్రేకుతో తాంతియానగర్‌ మధ్యలో ఆగింది ఆ పోలీస్‌ వ్యాన్‌.

పొడుగాటి లాఠీలు పట్టుకొని, పుట్టలో నుంచి వెలువడుతున్న చీమల మాదిరి స్పీడుగా బయటికి దూకారు పాతికమంది కానిస్టేబుల్స్‌.

పేదప్రజలు నివసించే ప్రదేశం ఆ తాంతియానగర్‌. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు మాత్రమే కనిపించే ముఫ్సల్‌ ఏరియా అది.

తూర్పు దిక్కు తెల్లబడక ముందే మిడతల దండులూ వచ్చిపడిన ఆ కానిస్టేబుల్స్‌ని చూసి కంగారు పడిపోయారు అక్కడ ఉన్నవారందరూ.

''ఏమయింది సార్‌? ఎందుకు వస్తున్నారు సాబ్‌? ఎవరు కావాలి సాబ్‌?'' వణుకుతున్న కంఠంతో వినయాతి వినయంగా ఒక కానిస్టేబుల్‌ని అడిగాడు అప్పుడే తన కాకా ¬టల్‌ని తెరిచి, చాయ్‌ తయారుచేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్న యాదగిరి.

''నోరు మూసుకుని నీ పనేదో నువ్వు చూసుకోరా బేవకూఫ్‌.... నోరెత్తావంటే నాలుకు చీరేస్తాను.'' కర్కోటకుడి మాదిరి గయ్యిమని అరిచి కాకా ¬టల్‌ వెనుకభాగంలో నిట్టనిలువుగా పెరిగివున్న ఒక గంగరావి చెట్టు వెనుక కాపలా కాశాడు కానిస్టేబుల్‌.

చిన్నబోయిన ముఖంతో చటుకున్న అవతలికి జరిగాడు యాదగిరి. గబగబా తలవంచుకుని తన పనిలో తాను బిజీ అయిపోతుండగా, ఠీవిగా అడుగులు వేస్తూ అక్కడకు వచ్చాడు ఇన్‌స్పెక్టర్‌.

''చాయ్‌ ఇవ్వు, దొరగారికి వెంటనే మంచి స్ట్రాంగ్‌ చాయ్‌ చేసివ్వు'' ఆయన వెనుక నించి హెచ్చరించాడు మరో కానిస్టేబుల్‌.

యాదగిరి మనసులో అధికం అయిపోయింది ఆందోళన.

సంగా తెల్లవారకుండానే అంతమంది పోలీసులు ఆ పేదలవాడకు రావలసిన కారణమేమిటి? తెలుసుకోవాలంటే మధుబాబు రాసిన అతను క్రైమ్‌ థ్రిల్లర్‌ చదవండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good