ఇతివృత్తం ఎంపిక, కథా సంవిధానం, కథనశైలి అన్నిటా ఆధునికత, ప్రగతిశీలత, ప్రయోజనం రంగరించిన అరుదైన కథా కదంబం ఇది. విభిన్న అంశాలలో లోతైన పరిశీలన చేసి రాసినవి. ప్రతి కథలో మన చుట్టూ ఉన్న మనుషులే పాత్రలు. మనస్తత్వ విశ్లేషణ జరిగినా, సంఘటనల వల్ల స్ఫురించాలే గాని సుదీర్ఘమైన ఉపదేశాలు, సంభాషణలు ఉండవు. ఈ ప్రత్యేక లక్షణం వల్ల ఉండవిల్లి.ఎమ్‌ గారి కథలు పాఠకులను ఆలోచింపజేసి, అప్రమత్తులను చేస్తాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రలను రచయిత మలచిన తీరు ఆయన అవగాహనకు అద్దం పడుతుంది. సంభాషణలు జవజీవాలతో ఉండగా, వర్ణనలు సహజంగా ఉన్నాయి. అంతర్జాలం సాక్షిగా ప్రపంచీకరణలోకి మన తెలుగు సమాజం కూడా ప్రవేశించి ఎదుర్కొంటున్న అస్థిరతను నేర్పుగా చిత్రీకరిస్తూనే పరిష్కార సూచన చేయడం రచయిత నిర్మాణాత్మక ఆలోచనా విధానాన్ని సూచిస్తోంది.

వ్యక్తిగత అభిరుచులు మనిషి అంతశ్చేతనను నిర్మిస్తాయి. అదే జీవితంలో వారి ప్రవర్తనకు ఊతమిస్తుంది. ఆ శక్తిని పాజిటివ్‌గా అందించి సమాజ సంస్కరణలో తనదైన ముద్ర వేయడంలో రచయిత కృతకృత్యులయ్యారు. అన్ని వయసుల పాఠకుల హృదయాలకు చేరే కథలివి.

పేజీలు : 118

Write a review

Note: HTML is not translated!
Bad           Good