తెలుగు వారి భాషా సంస్కృతుల మేలిమి సంపదను తెలుసుకోవాలన్న అభిలాష, తపన గల వయోజనులకూ ఉపయోగపడగల పెద్ద బాధ్యతను తలకెత్తుకుని, 125 మంది తెలుగు ప్రముఖుల జీవన రేఖలను ''తెలుగు కీర్తి కేతనాలు'' అన్న గ్రంథం ద్వారా అందించడం వెనుక ఎంతో శ్రమ ఉంది. ఇందుకు వారు బహుధా ప్రశంసనీయులు. రచనా సౌలభ్యం కోసం గ్రంథాన్ని ఆయన 18 విభాగాలు చేశారు. ఇందులో ప్రాచీన సాహితీవేత్తలు, ఆధునిక సాహితీవేత్తలేగాక, నాటక, కళా, చలనచిత్ర, సంగీత, నాట్య, వాగ్గేయ, చిత్ర కళాకారులు, తత్త్వవేత్తలు, పత్రికారంగ ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వీరిలో నన్నయ నుంచి చిన్నయ వరకూ, మొల్ల నుంచి తరిగొండ వెంగమాంబ వరకూ, కట్టమంచి నుంచి కాళోజీ దాకా, ఆరుద్ర నుంచి ఆదిభట్ల వరకూ, పారుపల్లి నుంచి పినాకపాణి దాకా అలాగే పత్రికారంగం నుంచి వివిధ రంగాదల్లోని కేవల ప్రసిద్ధుల వరకూ కొందరు ఉన్నారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good