ఆంధ్ర సాహిత్య స్రవంతి వేయేండ్ల క్రితం చాళుక్య రాజరాజు ఆస్థానంలో సర్వాంగ సుందరంగా దర్శన మిచ్చింది. అది మొదలు నేటి వరకు అడుగడుగు నిక్షేపంగా క్రొంగ్రొత్త రుచులతో సరసుల నలరిస్తూనే ఉంది. ఆ మహాతీర్థంలో పలువన్నెలతో విరిసి, తావులు వెదజల్లే శతపత్రాలను ముగ్ద మధుర ముకుళాలను పుణికి తెచ్చి, సరసకవులగు శ్రీ కాటూరి వేంకటేశ్వరరావు గారు మూలికారచన చేసి యిచ్చిరి. తెలుగు సాహిత్యం ఎప్పటికప్పుడు చేసికొంటున్న క్రొత్త కైసీతలతీరుల నొక్కచో ప్రదర్శించే ఈ ముప్పేట కావ్యమాలను సాహిత్య అకాడెమీ శారదా చరణకమలముల చెంత సమర్పిస్తున్నది. ఈ కావ్యమాలను ముఖ్యమైన భారతీయ భాషలన్నింటిలోకి పరివర్తింప జేయాలని అకాడెమీ ఆశిస్తున్నది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good