పత్రికలు, ప్రసార సాధనాల బాధ్యత ఏమిటి? ఆ బాధ్యతను అవి చక్కగా నిర్వర్తిస్తున్నాయా? ఈ చర్చ అనాదిగటా జరుగుతున్నదే. ఇటీవల కొంంచెం ఎక్కువైంది. పత్రికలు పాలకమ్మన్యులకు అనుకూలమైన వార్తలు, వ్యాఖ్యలు, చిత్రాలు, వ్యంగ్య చిత్రాలు ప్రచురించినంతకాలం అవి తమ బాధ్యతను సక్రమంగానే నిర్వహిస్తున్నట్లు రాజకీయులు భావిస్తారు. వారి కూటనీతిని, వక్ర స్వభావాన్ని, వంచనాశిల్పాన్ని, అనన్య సామాన్య స్వార్ధాన్ని బయట పెట్టినప్పుడే పత్రికలు బాధ్యతను విస్మరిస్తున్నాయన్న బృందగానం మొదలవుతుంది. పత్రికలు తమ హక్కులను ఎంత ప్రియంగా చూచుకుంటాయో తమ బాధ్యతలను కూడా అంతగానే నెరవేర్చడానికి పాటు పడతాయి. అందులో కొన్ని విఫలం అయితే కావచ్చు. కాని జన సామాన్యం ఆశించిన రీతిలో సమాజానికి వాకిటి కావలి వాడుగా తమ బాధ్యత గుర్తెరిగి వ్యవహరించడానికి ఎన్నడూ వెనుకంజ వేయవు. వార్తల ఎంపికలో, రచనలో, ప్రచురణలో పత్రికా రచయిత ఎప్పుడూ వార్తాంశాల్ని బట్టి మాత్రమే వ్యవహరిస్తాడు. అలాంటప్పుడు సమాజ శ్రేయస్సు కోసం ఎవరినో నొప్పించే వార్త వ్రాయవలసి వచ్చినా బాగా ఆలోచించి సచేతనం గానే దాని ప్రచురణకు పూనుకుంటాడు.
పత్రికా రంగంలో ఎవరో కొందరు అత్యుత్సాహం వల్లనో, అజ్ఞానం వల్లనో, అహంకారం వల్లనో తమ పరిధులను అతిక్రమించిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి వారిని సరైన దారిలో పెట్టాలంటే వారికి పత్రికా రచన సంప్రదాయాలను, విధి నిషేధాలను ఎరుక పరచడం ఒక్కటే మార్గం. అందుకు శ్రీ దుర్గం రవీందర్ ప్రకటిస్తున్న ఇలాంటి పుస్తకాలు ఎంతైనా ఉపయోగపడతాయి. విద్యార్ధులకు ఇది పఠనీయ గ్రంథంగా ఉపయోగపడుతుందనడంలో అనుమానం లేదు.
Rs.150.00
Out Of Stock
-
+