మన పూర్వులు తమ స్వానుభావాలను సూత్రాలుగా వచించారు . తెలుగు భాష లో మకరంద బిందువుల వంటి పదాలతో ఇవి వుంటాయి. వీటినే సుడికారాలని , పలుకుబడులని, పడబదాలని తెలుగు జాతికి సంబంధించినవి కనుక తెలుగు జాతీయాలని అన్నారు. మనలోని భావాన్ని ఎదుటివారి మనసుకు హత్తుకునేలా చెప్పేందుకు ప్రతి తెలుగు నాడు కొత్త పద బంధాలను, జాతీయాలను సృష్టిస్తూనే ఉంటాడు. ఒక ప్రత్యక జాతికి సంబంధించిన ప్రత్యెక విషయాలను వ్యక్తీకరించేవే జాతీయాలు. అవి భాషలో బలమైన స్తానాన్ని ఆక్రమించు కుంటాయి. జాతీయాలు లేని బాష పేలవంగా ఉండడమే గాక , జాతీయాలు లేని జాతి పూర్వ చరిత్ర కూడూ చాలా పేలవంగానే ఉంటుందనుకోవాలి. ఈ పుస్తకం పోటి పరీక్షలకు వెళ్ళే వారికి, సాహిత్య విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, రచయితలకు జర్నలిస్టులకూ , తెలుగు భాషామానులకూ ఉపకరిస్తుందని నా నమ్మకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good