మాట అనేది ఒక సాధారణ పదం. భాషా వినియోగం పెరిగాక ఒకమాట - పలు ఛాయలలో విస్తృతి పెరిగింది. పలు జాతీయాల సృష్టికి నిలయమైంది. కాలప్రవాహంలో పదం వాడుక తగ్గిపోవచ్చు. కానీ జాతీయం చిరకాలం ఉంటుంది. అది జాతీయాల స్వభావం.
తెలుగులో ఈనాటికీ వాడుకలో గల జాతీయాల ఇంపుసొంపులు ఇంతింతని చెప్పలేము. తెలుగు వనితకు తాళి ప్రాధాన్యం గురించి అందరికీ తెలుసు. అది ప్రాణపదం. ఒకప్పుడు తాళిని పసుపుదారంతో కూర్చి మెడలో వేసుకునేవారు. వాడుకలో దారంపోగులు బలహీనమై అది తెగిపోయినపుడు తాళఙతాడు తెగిందా అనేందుకు మనసొప్పదు. అందుకు మారుగా తాళితాడు పెద్దద్దైంది, పెరిగి పోయిందీ అని విచిత్రంగా అంటారు. ఇంట్లో బియ్యం అయిపోయాయి అనలేరు. బియ్యం నిండుకున్నాయి అని కవిఆమార్గంలో అంటారు. 'అతను చాలా మంచోడులే' కితాబు ఇస్తే అతను దుర్మార్డుడు అనే భావం వస్తుంది. అత్తెసరు అంటే ఎసరులో నీరు తక్కువవుంచడం. ఇది అత్తగారి పొదుపును, పెత్తనాన్ని సూచిస్తుంది.
ఇహ 'కలికి గాంధారివేళ' - కలికి అంటే స్త్రీ, గాంధారి ధృతరాష్ట్రుని భార్య పేరు. గాంధారివేళ అంటే సముచిత సమయం. ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డి. అయినా అతడు రారాజు. గాంధారి తప్పనిసరి పరిస్ధితులలో అతడిని వివాహమాడింది.  గాంధారి పగలంతా - భర్తతో రాజదర్బారులో కూర్చోవడం వలన ఎప్పుడూ అర్ధరాత్రి 2 - 3 గంటల వేళ స్నానానికి వెళ్ళేది. అప్పుడు ప్రపంచమంతా సుషిప్తిలో వుంటుంది. అంతా నిశ్చలనం. అనేక కారణాలవలన తనకు తానుగా అంధత్వాన్ని ఆపాదించుకున్న గాంధారి స్నాన ఉదంతాన్ని పామరులు, జానపదులు వివరంగా చెప్పగలరు.
జాతీయాలకు వివరణ రాయాలంటే పలు భాషల పరిజ్ఞానం ఎంతైనా అవసరం. అలాంటి సమర్ధుల సహకారంతో ఈ 'తెలుగు జాతీయాలు' ఈ సంకలనంలో చోటిచ్చినది సంపాదకులు శ్రీ వెలగా వెంకటప్పయ్య గారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good