1932 మే మూడో తేదీన ప్రకాశం జిల్లా వేటపాలెంలో జన్మించిన డాక్టర్‌ బూదరాజు రాధాకృష్ణ 1965లో హిస్టారికల్‌ గ్రామర్‌ ఆఫ్‌ ఎర్లీ తెలుగు ఇన్‌స్క్రిప్షన్స్‌ అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. చీరాల వి.ఆర్‌.ఎస్‌. అండ్‌ వై.ఆర్‌.ఎస్‌. కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసిన వీరు 1988లో తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. సెంట్రల్‌ యూనివర్శిటీ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వుండి 1990 నుంచి దశాబ్ద కాలంపాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. కలం పడితే చాలు కదళీపాకంలా సాగిపోయే అక్షర తరంగాలు, పెదవి విప్పితే చాలు సాగర ప్రవాహంలా దూసుకువచ్చే వాక్‌జలధి వీరి ప్రత్యేకత. తెలుగు, సంస్క ృత భాషల్లో గట్టి పునాదితో సమకాలీన తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్నారు. తెలుగు భాషా మర్మాల గురించి సాధికారికంగా చెప్పగలరు. చిక్కుముడులు విప్పగలరు. ఆధునిక పత్రికల భాషను ప్రమాణీకరించిన ఘనత వీరిదే. తెలుగు లెక్చరర్‌గా వీరు ఎందరికో ఆదర్శ గురువు. తెలుగు భాషా సాహిత్యాలపై విస్తృత అధ్యయనం కో సం ఉపయోగపడే ఎన్నో పుస్తకాలను తెలుగు పాఠకులకు అందించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good