జగతి లో నిలబడి నడవగలగటం మానవుడు సాధించిన తొలివిజయం. అందుకే భూప్రపంచం మానవుడిని జంతుజాలం నుండి ప్రత్యేకంగా నిలిపింది. నిటారుగా నిలిచిన తొలినాళ్లలోని ఒక ఆదిమ మానవుడి అవశేషాలు 2000వ సంవత్సరంలో కెన్యా దేశంలో లభించాయి. ఈ శిలాజాలపై పరిశోధన చేసిన వాషింగ్టన్‌లోని స్టోనీబ్రూక్ విశ్వవిద్యాలయ బృందం నాయకుడు విలియం జంగర్స్, ఆదిమ మానవుడు 60 లక్షల సంవత్సరాల క్రితం నడవటం నేర్చుకున్నాడని తేల్చిచెప్పాడు (చూ: 22, మార్చి 2008, ఆంధ్రజ్యోతి దినపత్రిక). మనిషి నిలబడటానికి ప్రయత్నించి విజయం సాధించటం ప్రపంచ చరిత్రలో మొదటి జానపద కళగా మనం చెప్పుకోవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good