మొట్టమొదటి సోషలిస్టురాజ్యం డెబ్బైఏళ్ళే మనగలిగింది. ప్రపంచ చరిత్ర పరిధిలో ఇది చాలా తక్కువ కాలం. దాని విజయాలలో లోపాలనే ఎంచడం, దాని పతనంతో విజయాలను శూన్యం చేసి చూపడం జరుగుతున్నది. పతనం అయింది కాబట్టి అందులో ఏ గొప్పతనం లేదని చెప్పలేము. కార్మికుల కర్షకుల రాజ్యం సాధ్యమేనని ఈ విప్లవం నిరూపించింది. కేవలం ధనికులకే కాదు అశేష జనసమూహాల ప్రయోజనాల కోసం విధానాల రూపకల్పన సాధ్యమేనని చేసి చూపించింది. ప్రజలను ఆకలితో మాడ్చి చంపడం కాదు, రాజ్యం వారికి చదువును, ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలదని రుజువుచేసింది.

రష్యా విప్లవ ప్రాధాన్యతను తరచి చూసేందుకు, ఎక్కడ పొరపాట్లు జరిగాయో అవగాహన చేసుకునేందుకు, ఈనాటి పరిస్థితులకు ఆ విప్లవ అనుభవాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకునేందుకు జరిగే చర్చలకు ఆహ్వానమే ఈ 'రెడ్‌ అక్టోబర్‌'.

పేజీలు : 224

Write a review

Note: HTML is not translated!
Bad           Good