సామ్రాజ్యవాద ద్రవ్యసంస్థల ఒత్తిడితో గనులు, ఖనిజాల చట్టానికి పలుమార్లు సవరణలు చేసిన పాలకులు దేశప్రజల సంపదైన అన్నిరకాల ఖనిజాలను సామ్రాజ్యవాదులకు ధారాదత్తం చేశారు. చమురు, సహజవాయువు రంగాన్ని నూతన అన్వేషణ లైసెన్సింగ్‌ విధానం పేరిట ఎలా సామ్రాజ్యవాదాఉల పరం చేసిందో కేజి బేసిన్‌పై వ్యాసం వివరించింది. అలాగే బొగ్గుగనుల కేటాయింపుల్లో కూడా విదేశీ పెట్టుబడివేసిన పెద్దపీటను, ఆ క్రమంలో సాగిన అవినీతి కార్యకలాపాల దారిదోపిడీని వివరించింది. అటవీ ప్రాంతాలలో గనుల తవ్వకాలను ప్రైవేటురంగానికి యివ్వరాదనీ భారత 'సర్వోత్తమ' న్యాయస్థానమిచ్చిన తీర్పును వమ్ముచేసేందుకూ, 'పెసా' చట్టాన్ని ప్రక్కనుంచేందుకూ భారత పాలకులు చేసిన అక్రమ ప్రయత్నాలను బాక్సైట్‌పై వ్యాసాలు ఎత్తిచూపాయి.

పేజీలు : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good