సాధారణంగా ఒక కొత్త భావజాలం రూపుదిద్దుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యతను మోసే కార్యకర్తలకు ఇలాంటి పాఠశాల రీతి శిక్షణ సులువుగా ఉంటుంది. చదువు చెప్పేవాళ్ళు, చదువుకునే వాళ్ళ మధ్య ఎడతెగకుండా సాగే భావజాల ఆదానప్రదాన సందర్భాల్లో - ప్రశ్నోత్తరాల సమయాల్లో - విషయ స్పష్టీకరణ - విపులీకరణ - తేలిగ్గా వివరించే లక్షణాలూ ముందుకొస్తాయి. వీటివల్ల అధ్యాపకులు - కార్యకర్తలుగా ఉన్న విద్యార్థుల్లో - తమ కార్యరంగంలో ఎదురయ్యే ప్రశ్నలకు సమర్థవంతమైన - సమంజసమైన - సర్వులకూ అంగీకారయోగ్యమైన సమాధానాలు చెప్పే నైపుణ్యం పెరుగుతుంది. ఆ భావజాల వ్యాప్తికి వారందిరికీ తమతమ రంగాల్లో ఉత్సాహం ఇనుమడిస్తుంది. సరిగ్గా ఇలాంటి అవసరం 1943లో తెలుగునాట ఆవిర్భవించిన ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘానికి ఏర్పడింది. రచయితల ఉద్యమం సంస్థాగత నిర్మాణ రూపాన్ని సంతరించుకోటానికీ, విస్తృతపరచుకోటానికీ తన కార్యకర్తలను సర్వసన్నద్ధులనుగా చేసుకోవాల్సిన సందర్భం అది. కనుకనే, 1946లోని పెదపూడి సాహిత్య పాఠశాల. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల గురించి, సమర్థవంతంగా వివరించిన గ్రంథం ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good