ఆధునిక ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగినా మన కుటుంబ జీవితంలో ఆ “సంకుచిత్వం” అలానే కొనసాగుతూ వచ్చింది. శృంగారం (సెక్స్‌) గురించి చర్చించటం మాట అటుంచి, మాట్లాడటమే నేరంగా మారింది. ఎవరయినా మాట్లాడితే వింతగా చూడటం, వాళ్ళ గురించి విమర్శించటం పరిపాటి అయింది. ఫలితంగా మన విద్యార్ధులు సైతం కప్పలు, వానపాములు, బొద్దింకల జననేంద్రియాల గురించి తెలుసుకుంటారు! కానీ మానవ జననేంద్రియాల గురించి తెలీని దుస్థితిలో మిగిలిపోయారు!

1970లో డాక్టర్‌ సమరం 'సెక్స్‌ సమస్యలు - సమాధానాలు'' అనే శీర్షికను ప్రారంభించినప్పుడు ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సమరం దానినొక యజ్ఞంలా కొనసాగించారు. క్రమేపీ ఆ శీర్షికకు దొరికిన ఆదరణను చూసి, అనేక పత్రికలు అలాంటి శీర్షికలను ప్రారంభించాయి. సెక్స్‌ విషయమై ఉన్న దురభిప్రాయాలను తొలగించటానికి, సమస్యలకు పరిష్కారం పొందటానికి అదొక మార్గం అయింది. తర్వాతకాలంలో డాక్టర్‌ కంభంపాటి స్వయంప్రకాష్‌, డాక్టర్‌ యర్రా నాగేశ్వరరావు వంటి అనేకమంది ఈ కృషిని మరింత ముందుకు తీసుకుపోయారు. ఫలితంగా ''భారతీయ నైతిక విలువల పతనం''గా గగ్గోలు పెట్టేవారి సంఖ్య తగ్గిపోయింది. దీనినొక సైన్సుగా, సుఖరోగాలు కూడా అన్ని రోగాల వంటివేననే ఆలోచనను ఆమోదించటం జరుగుతోంది. అయినప్పటికీ సెక్స్‌ పరిజ్ఞానాన్ని శాస్త్రీయంగా బోధించడం జరగనందున ఎన్నో అపోహలు, సందేహాలు కలుగుతూనే ఉన్నాయి. యువతరంలో ఇవి మరింత ఎక్కువ. స్వీయ అనుభవంలో వచ్చే అనుమానాల నివృత్తికి ఉపయోగపడే పుస్తకాలలో ఇదొక మంచి పుస్తకం! అనేక వయసుల, అనేక ప్రవృత్తులలో ఉన్నవారి సమస్యలను సూచించే పరిష్కారాలు మరింత ఎక్కువ మందిని చైతన్యవంతం చేస్తాయి.

మరొక విషయం. సెక్స్ సమస్యలలో ఎక్కువభాగం, మనస్తత్వశాస్త్రం(సైకాలజీ)తో ముడిపడివుంటాయి. ఎందుకంటే, మానసికప్రశాంతత శ్రుంగారంలో కీలకపాత్ర పోషిస్తుంది. సెక్స్ పట్ల అవగాహనారాహిత్యం, వేగవంతమైన ఆధునిక జీవితశైలి, పనివత్తిడి, (ముఖ్యంగా పురుషులలో) సెక్స్ లో వైఫల్యాలకు కారణమవుతున్నాయి. అందువల్ల అనేకసందర్భాలలో, సైకియాట్రిస్టుల కౌన్సిలింగ్ అవసరమౌతోంది. అందువల్లనే సెక్స్+సైకాలజి= "సెక్సాలజీ" అనేకొత్త సబ్జెక్ట్ ముందుకొచ్చింది!

EBook
EBook Type PDF
Size 800 Kb
No.of Pages 90

Write a review

Note: HTML is not translated!
Bad           Good