అల్లూరి సీతారామరాజు' చిత్రానికి హీరో కృష్ణ నటజీవితంలోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనూ చెప్పుకోదగ్గ స్థానం ఉంది. భారత స్వాతంత్ర్యోద్యమంలో విప్లవజ్యోతిగా వెలిగి, దేశమాత దాస్య శృంఖలాలను విడిపించడం కోసం ప్రాణాలను లెక్కచేయని చిచ్చరపిడుగు అల్లూరి సీతారామరాజు. ఆయన జీవితకథ ఆధారంగా, చారిత్రకంగా 'అల్లూరి సీతారామరాజు' చిత్రాన్ని నిర్మించారు కృష్ణ. ఆయనలో 'సినిమా తీసి వ్యాపారం చేద్దాం' అనే నిర్మాత కంటే, 'చిత్రం నిర్మించి సంచలనం సృష్టిద్దాం' అనుకొనే సాహసే ఎక్కువగా కనిపిస్తాడు. హీరో కృష్ణ వెండితెరపై చేసిన మరో సాహసం 'అల్లూరి సీతారామరాజు' చిత్రం. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆయన నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా హీరో కృష్ణ సాహసానికి నిదర్శనంగా నిలిచింది.
తెలుగువారి కీర్తి ప్రతిష్టలు జాతీయ స్థాయిలో ఆవిష్కరించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రం గురించి సమగ్రంగా ఓ పుస్తకం రాయాలన్న ఆలోచన రెండేళ్ళుగా నా మదిలో మెదులుతోంది. కేవలం చిత్ర నిర్మాణ విశేషాలే కాకుండా అల్లూరి సీతారామరాజు చరిత్రకి సంబంధించిన వివరాలు కూడా ఈ పుస్తకంలో ఇస్తే బాగుంటుందనిపించి, సీతారామరాజు చరిత్రపై పరిశోధనలు చేసిన కొందరిని కలిసి సేకరించిన వివరాలను ఇందులో పొందుపరిచాను. ఈ ప్రయత్నంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- వినాయకరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good