చిన్నతనం నుంచీ తెలుగు గాయకులు గ్రామఫోను రికార్డులు వింటూ, నలుగురిని పిలిచి వినిపిస్తూ వుండేవాడిని. నా తోటి పిల్లలు నా 'పిచ్చి'ని చూసి నవ్వుకునేవారు. పెద్దవాడిని అయిన తరువాత కూడా ఆ రికార్డులలో మన లలిత సంగీత సమ్రాట్టుల పాటలు వింటూ మైమరచిపోతూ వుండేవాడిని. కాని ఈ రికార్డులలో నిక్షిప్తమై వున్న సంగీత సరస్వతిని గురించి నలుగురికీ తెలియజెప్పాలన్న నా ఆకాంక్ష రోజురోజుకూ ఎక్కువ కాసాగింది.

పాత లలిత గీతాల, నాటకగీతాల సి.డి.ని, దానితోపాటు ఆయా గాయకుల గురించిన పరిచయాన్ని యిస్తూ ఆ రెంటినీ కలిపి ఈనాటి శ్రోతలకు అందించడం ఆంధ్రప్రదేశంలో తొలి ప్రయత్నం. ఈ ప్రయత్నం సఫలమైతే - ఇంకా ఎందరో పాతతరం మహాగాయకులు అమృతోపమానమైన పాటలను మీకు అందించే ప్రయత్నం చేయగలము. - యం.సూరిబాబు

Write a review

Note: HTML is not translated!
Bad           Good