సినిమా పట్ల గాఢమయిన అభిరుచి, ఆసక్తి వున్న సినిమా విద్యార్థులకు ఇది విజ్ఞాన సర్వస్వం. 1895 నుంచి 1930 వరకు క్రమ పరిణామంలో మూకీ సినిమా రూపొందిన విధానాన్ని పసుపులేటి పూర్ణచంద్ర రావు కళ్లకు కట్టించారు. ఫ్రాన్సులో మొదలయిన సినిమా ఎట్లా ప్రపంచ వ్యాప్తమయిందో, సమాంతరంగా భారతీయ సినిమా ఎట్లా రూపుదిద్దుకుందో ఆయన వివరించారు.

ఇదొక మహాగ్రంథం. ఇదొక మహాసముద్రం, ఇదొక మహాప్రస్థానం, పూర్ణచంద్ర రావుగారు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ సినిమారంగం పట్ల అపారమయిన అనురాగంతో చేసిన అనంత శ్రమకు ఫలిత మీ రచన.

'ముక్క సినిమా' అనేది పూర్ణచంద్రరావుగారి 'సృష్టి '. ఆ ముక్క నాకెంత నచ్చిందో...!

ఈ గ్రంథాన్ని చదవడం ఒక అదృష్టం.
- తనికెళ్ళ భరణి

Write a review

Note: HTML is not translated!
Bad           Good