శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా అవతరించినది మొదలు, పద్మావతీదేవిని పెళ్ళాడి, ఆ తదుపరి శిలామూర్తిగా మారేవరకు చిత్రించి, స్వామివారి మహిమలు కూడా కొన్ని చూపిస్తూ చక్కని చిత్రంగా నిర్మించిన ఖ్యాతి 'పద్మశ్రీ' పుల్లయ్యగారిది.

సాంఘీక కథా చిత్రలకే 'మనసు' పెట్టి రాసే ఆత్రేయ యీ పౌరాణిక చిత్రానికి మాటలు, పాటలు రాసి తన 'ఆచార్యత్వాన్ని' నిరూపించుకున్నారు. ఈ రాతల్లోనూ తనదైన శైలినే చూపించారు. వాడుక భాషలో అలతి పొలతి పదాలతో మాటలు రాశారు.

పెండ్యాల స్వరరచన కూడా లలిత లలితంగా సమకూర్చారు. దీనివల్ల సంగీత సాహిత్యాలు సమపాళ్ళలో సాగి, చిత్రాన్ని క్లాసిక్‌గా నిలిపాయి. అదే యీ చిత్రం ప్రత్యేకత.

Write a review

Note: HTML is not translated!
Bad           Good