డాక్టర్ రామానాయుడు ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా చరిత్రను రాయడం ఎవరికైనా అసాధ్యం. సినిమాలతో ఆయన జీవితం అంతగా మమేకమైంది. చిత్రరంగంలోకి అడుగుపెట్టే ప్రతి నిర్మాత ప్రారంభదశలో పరిశీలించే డిక్షనరీలాంటి వ్యక్తి రామానాయుడు. ఆయన జీవితం తెరచిన పుస్తకంలాంటిది. ఆ విషయం తెలిసినా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు ... భారతీయ సినీ రంగానికే మకుటాయమనంగా నిలిచిన ఈ ఆదర్శ నిర్మాత విజయ ప్రస్థానాన్ని మరోసారి ఆవిష్కరించే సాహసం చేస్తున్నాను. ఐదు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమతో విడదీయరాని బంధం అనుబంధం ఏర్పరచుకున్న రామానాయుడు గురించి పుస్తకం రాయాలంటే తెలుగు సినీ చరిత్ర లోని కీలక అంశాలను ఆమూలాగ్రం స్పృశించినట్లే . ఏడాదిపాటు నిర్విరామంగా సాగిన ఈ అక్షర క్రతువుకి పుస్తకరూపం ‘మూవీ మొఘల్’. ఇప్పుడు పుస్తకం మీ చేతుల్లో ఉంది. నేను ఏ మేరకు విజయం సాధించానో తేల్చి చెప్పాల్సింది మీరే.
- వినాయకరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good