మహానటి సావిత్రి గురించి శ్రీమతి పల్లవి రూపొందించిన

ఈ పుస్తకం చాలా యధార్థంగా ఆమె జీవితాన్ని ఆవిష్కరించింది. - గుమ్మడి వెంకటేశ్వరరావు


గాలినిండా సువాసనను నింపే మంచి గంధపు ముక్క వంటిది సావిత్రి!

చీకటి చిక్కదనానికి భయపడకుండా ఉజ్వలంగా వెలిగే కర్పూరపు

తునకవంటిది సావిత్రి! ఆ చందన శకలాన్ని, కర్పూరపు ముక్కను

తెలుగు పాఠకులకందించిన పల్లవిగారిని అభినందిస్తున్నాను. - రావూరి భరద్వాజ


మహానటి సావిత్రి మన తెలుగుజాతి సంపద. ఈ తరం వాళ్ళమయిన మనం, ఈ అమూల్యమైన సంపదను ముందు తరాలకి పరిచయం చేయాలి. ఈ ఒక్క పని మనం చేస్తే చాలు, ఆమె నటనని విశ్లేషిస్తూనో, ఆమె స్నిగ్ధత్వాన్ని, మంచితనాన్ని కొనియాడుతూనో, ఆమె జీవిత చరిత్ర మరొక్కసారి తిరగవ్రాస్తూనో.... ఇంకెందరో పల్లవిస్తారు. - పల్లవి

Write a review

Note: HTML is not translated!
Bad           Good