సినిమా తయారయ్యేది సెట్స్‌ మీద కాదు - ఆప్‌సెట్స్‌ మీదనే అంటారు స్వామి చిత్రానంద.
నిర్మాతలు వేర్వేరు కావచ్చు...దర్శకులు వేర్వేరు కావచ్చు...
నటీనటులు వేర్వేరు కావచ్చు...
కానీ ఈ కథల్లో ఏ యూనిట్‌ చూసినా సామాన్యధర్మంగా కనబడేది...
అడావుడి, గందరగోళం, ప్రణాళికారాహిత్యం ఈ సినీ మాయబజారులో
కూర్చేది కథలు కాదు - గిథలు
జరిగేది షూటింగ్‌ కాదు - గీటింగు
కనబడేది కంబళీ కాదు - కంగాళీ
సినిమా నిర్మాణాన్ని వేర్వేరు దశల్లో స్పాట్‌లైట్‌ వేసి అక్కడున్న తికమక పరిస్ధితికి అద్దం పట్టి సున్నితమైన వ్యంగాన్ని రంగరించి అందించిన 17 కథా గుళికలు. ఈ రంగంలో అయిదు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగి, అనేకమంది సమర్ధులను, అసమర్ధులను తరచి చూచి అనేక వింత వింత పరిస్ధితుల్లో స్వయంగా పాల్గొన్న వారు మాత్రమే వ్రాయగలిగిన రచన ఇది!'' - వరప్రసాద్‌ (ప్రచురణ కర్త)

Write a review

Note: HTML is not translated!
Bad           Good