50ల నాటి సినిమా రివ్యూలు,
కార్టూన్లు, కార్ట్యున్లు, జోకులు, మకతికలు వగైరా'
ఈ పుస్తకానికి 'ముందుమాట'గా ప్రచురణకర్తలు ఏమన్నారో చూద్దాం.
''గత పది సంవత్సరాలుగా మేము ప్రచురించిన ఎనిమిది సంపుటాల'' ముళ్ళ పూడి సాహితీసర్వస్వం'' యెక్క అనేక ముద్రణల ద్వారా ముళ్ళపూడి వెంకటరమణగారు నవతరం పాఠకులకు కూడా పరిచితులు కావడం వలనా, వారి ఆత్మకథ ''కోతికొమ్మచ్చి'' ద్వారా ఆయన పేరు ఇంటింటా వినబడే స్థాయికి చేరడం వలనా, వారి పాతపుస్తకాల కోసం అడిగేవారి సంఖ్య బాగా పెరిగింది.
అలాంటి పాఠకుల కోరిక మేరకు చేపట్టినదే బాపూరమణీయం పునర్ముద్రణ. దీని తొలి ముద్రణ 1990 ఏప్రిల్లో నవోదయ పబ్లిషర్స్ ప్రచురణగా వెలువడింది. ఆంధ్రపత్రిక వీక్లీలో పనిచేసే రోజుల్లో 1955 - 60 లో రమణగారు రాసిన సినిమా సంబంధిత వ్యాసాలు, వ్యంగ్యరచనలు, సమీక్షలకు తోడుగా ఆ కాలంలోనే బాపుగారు అదే వీక్లీకి వేసిన కార్టున్లు, కార్ట్యూన్లూ జోడించి అనేక ఫొటోలతో ఈ పుస్తకం రూపొందింది.
ఈ విలక్షణ పుస్తకంలోని కార్ట్యూన్లు, రివ్యూలలో కొన్ని బాపురమణల ఇతర పుస్తకాలలో చోటు చేసుకున్నా ఈ పుస్తకం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. అందుకే రెండు దశాబ్దాల తరువాత పాఠకుల కోరిక మేరకు కొత్తరూపంలో, అదనపు ఫోటోలతో మీ ముందుకు వస్తోంది. తొలి కూర్పుకు శ్రీ శ్రీరమణ సారథ్యం వహించగా, మలికూర్పు శ్రీ ఎమ్బీయస్ ప్రసాద్ చేతుల మీదుగా జరిగింది.
విశాలాంధ్ర ప్రచురణాలయం ముద్రణగా ప్రస్తుతం మీ కందుతున్న ఈ ''బాపూరమణీయం'' కూడా పాఠకాభిమానం పొందుతుందనే మా నమ్మకం.''
Rs.180.00
Out Of Stock
-
+