జర్నలిస్టు రానా అయ్యూబ్‌ ఎనిమిది నెలల పాటు అండర్‌ కవర్‌లో ఉంటూ గుజరాత్‌ మత కల్లోలాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, రాష్ట్ర హోమ్‌ శాఖమంత్రి హరేన్‌ పాండ్య హత్యలను దర్యాప్తు చేసి బయటపెట్టిన ఎన్నో విభ్రాంతికర విషయాల సమాహారమే గుజరాత్‌ ఫైల్స్‌. అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కన్జర్వేటరీ నుండి వచ్చిన ఫిల్మ్‌మేకర్‌ మైథిలీ త్యాగిగా రానా గుజరాత్‌ రాష్ట్రంలో 2001, 2010 మధ్య అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులను, పోలీసు అధికారులను కలిసింది. రాజ్యం, దాని అధికారగణం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేయటంలో ఎట్లా భాగస్వాములయ్యాయో ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా బయటపెట్టిన విషయాలు తెలుపుతాయి.

నరేంద్రమోదీ, అమిత్‌ షాలు అధికార శిఖరాలకు ఎగబాకటం కోసం గుజరాత్‌ నుండి ఢిల్లీ దాకా వాళ్ళు చేసిన ప్రయాణానికి సమాంతరంగా నడిచిన కేసుల గురించి ఎన్నో సంచలనాత్మక విషయాలను ఈ పుస్తకం బయటపెడుతుంది. విచారణ కమీషన్ల ఎదుట మాట్లాడవలసి వచ్చినప్పుడు మతిమరుపు నటించిన వారు రహస్యంగా టేపు చేసిన వీడియోల్లో ఏ ఒక్క విషయమూ దాచుకోకుండా చెప్పిన నిజాలను చాలా ఆసక్తిదాయకంగా ఈ పుస్తకం బయటపెడుతుంది.

Pages : 175

Write a review

Note: HTML is not translated!
Bad           Good