తోటలో నా రాజు తొంగి చూసెను నాడు' (''ఏకవీర'') - ఈ పాట శ్రుతి రమ్యతను, భావసౌకుమార్యాన్ని పొదుగుకోవడానికి - ఒకే రకమైన కొలతలున్న పదాల (ఒకే రకమైన గణాల) ఆవృత్తి అధికంగా వుండటమే!
'నన్ను దోచుకుందువటె వన్నెల దొరసానీ' (''గులేబకావళి కథ'') - పల్లవిలో అన్ని పదాలు దాదాపు త్రిశ్రగతి మాత్రాపదాలు- చివర 'నిన్నేనా' అనే షణ్మాత్రాపదబంధం కూర్చడం జరిగింది. (క)ర్పూర అనే పదంలోని 'క' అక్షరాన్ని అనాహతంగా ఉచ్ఛరించాలి. అప్పుడే గతి కుదురుతుంది.
'స్నేహమే నా జీవితం, స్నేహమేరా జీవితం' (''నిప్పులాంటి మనిషి'') ఖవ్వాళీ తరహాలో రాసిన యీ గీతంలో మొదటి రెండు చరణాలు లయరహితంగా సాగే సాకీతో వున్నా, దాన్ని గాయకుడు మసీదు ఆజా (పాడే) రీతిలో ఒక్క వూపుతో ఉచ్ఛస్వరంతో ఎత్తుకోవడం జరిగింది. ఆ తర్వాత పదాలు 'మిద్దెలొద్దూ మేడలొద్దూ' అంటూ మిశ్రగతిలో నడుస్తుంది. దానిని పునరుక్తం చేసినప్పుడు చతురస్రగతిలో పరవళ్ళు తొక్కుతుంది. రెండు తాళగతుల్లోనూ సరిపోయే విధంగా పై పాటలో పదజాలం కూర్పు వుండటం గమనించదగిన విశేషం! ఇలాంటి విశేషాలెన్నో!

Write a review

Note: HTML is not translated!
Bad           Good