మెదడుకు మేత, బుద్ధికి తేజస్సు, తెలివితేటలకు పదును, సమస్యలను పరిష్కరించే నేర్పును కోరుకునేవారు, పోటీ పరీక్షలకు వెళ్ళేవారు తప్పక చదవాల్సిన పుస్తకం 'తెలుగు పొడుపు కథలు'. సాహిత్యంలో కనిపించే పొడుపు కథలు తాత్త్వికపరమైనవి. మత ప్రాధాన్యం కలవి. ఋగ్వేదంలోని ప్రశ్నోత్తర రూపకములైన పొడుపు కథలు ప్రాచీనమైనవి. అవి మహాభారతంలోని యక్ష ప్రశ్నలకు సూచన అని పలువురి అభిప్రాయం. పొడుపు కథను ఒకరు పొడుస్తారు. దాన్ని ఇఒకొకరు విప్పుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల్లో, ఆయా సంఘాల్లో వారి వారి అలవాట్లను బట్ట పొడుపు కథకు ఎన్నో పర్యాయపదాలు వాడుకలో స్ధిరపడ్డాయి. జ్ఞానోదయాన్ని కల్గించేది, నిగూఢమైన అర్థాన్ని ప్రకాశింప చేసేది. మనస్సుకు సూటిగా తగిలేది, ఎదలో నాటేది, వెంటనే అర్థం తోచకుండా చిక్కులు పెట్టేది పొడుపు కథ. ఇది ప్రశ్నార్థక రూపకాతిశయోక్తి ప్రక్రియ. దీనికి బుద్ధి బలం, ప్రయత్నం అవసరం. పొడుపు కథలో ఉపమానోపమేయాలు రెండూ దాగి ఉంటాయి. ఇందులో ఉపమానం వాచ్యం. ఉపమేయం సూచ్యం. వాచ్యమైన ఉపమానంచే సూచ్యమైన ఉపమేయాన్ని గుర్తించడం సమాధానమనిపించు కుంటుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good