పూర్వం ప్రాథమిక పాఠశాలల్లో శతక పఠనం తప్పని సరిగా ఉండేది. పాఠ్యాంశాల్లో ఉన్న వాటినీ, పాఠ్యాంశాల్లో లేకపోయినా మంచి పద్యాలను కొన్న వాటిని ఉపాధ్యాయులు పిల్లలకు నేర్పించేవారు. శతకాల్లో ఎన్నో నీతులుంటాయి. ప్రవర్తనా నియమావళిని క్రమబద్ధం చేసుకోవటానికి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపచేసుకోవటానికి అవసరమైన ఎన్నో విషయాలు శతకాల్లో ఉంటాయి. శతకం ఒక నేస్తం లాంటిది. ఇంగ్లీషు పిచ్చి ముదిరిపోయి తెలుగు భాష మీద మమకారం తగ్గుతున్న ఈ రోజుల్లో పిల్లలకు మనం తప్పని సరిగా శతకాలు నేర్పించాలి. ఈ ఉద్దేశంతోనే తెలుగు భాషామాధుర్యాన్ని, క్రమ శిక్షణాయుతమైన ప్రవర్తనావశ్యకతను వివరిస్తూ ఈ శతకాన్ని రచించారు. ఇది సహృదయుల మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నాను. - గుమ్మా సాంబశివరావు |