కవిత్వం హృదయానికి సంబంధంచిన కళ...పాట మనసుకు సంబంధించిన ప్రక్రియ. ఈ మాటల్లో ఎంత నిజముందో శ్రీమతి సరళ రచనలు రుజువు చేస్తాయి. నాలుగు దశాబ్దాల పాటు ఒక సాదాసీదా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసిన వ్యక్తికి సహజంగానే చిన్న పిల్లలకు సరళమైన భాషలో విద్యాబుద్దులు నేర్పించాలనే తపన వుంటుంది. ఆ తపన ఆమె రచనలకు ఊపిరిపోసింది. అది ఆంధ్రుల చరిత్ర కావచ్చు...'ఆ ఆ'లు నేర్చుకోవడంలో కావచ్చు. శ్రీమతి సరళ కలం నుంచి జాలువారిన చిన్ని చిన్ని పదాలన్నీ పాలుగా మారి లేతమనసులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించగలుగుతున్నాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good