మనిషి మనుగడ జంతువులపై ఎంతగానో ఆధారపడి వుంది. హాని కలిగించే కొన్ని రకాలను మినహాయిస్తే జంతువులన్నీ మనిషికి సహాయకారులే.

నిజానికి పాములు మానవ జాతికి ఎంతో ఉపకారం తలపెట్టే జంతువులు. మనిషికి నష్టాన్ని కలిగించే కొన్ని జంతువులను మట్టుబెడతాయి.

కొన్ని అపోహల కారణంగా మనిషి పామంటే భయపడతాడు. వాటిని వెంటాడి వేటాడి చంపుతాడు.

పాములకు సంబంధించిన సమస్త భయభ్రాంతులను ఈ పుస్తకం బట్టబయలు చేస్తుంది. పాముల ఉపయోగాన్ని, అవి మనకు అందించే సహాయాన్ని తేటతెల్లంగా తెలియజేస్తుంది. వాటిని రక్షించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్తుంది.

సరళమైన భాషలో సుబోధకంగా శాస్త్రీయమైన దృష్టితో పాముల గురించి తెలుగులో తొలిగా బాలలకు డా|| మైనేని కేశవదుర్గాప్రసాద్‌ అందించిన విజ్ఞాన గ్రంథం 'పాముల ప్రపంచం'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good