ఇది 'కళాభారతి' కందేపి రాణీప్రసాద్‌ పదకొండవ పుస్తకం. బాలలపట్ల, వాళ్ళు కోల్పోతున్న బాల్యం పట్ల చక్కని అవగాహనతో రచనలు చేస్తున్న రాణీప్రసాద్‌ చిన్నారి నేస్తాలకు అందిస్తున్న ఈ మిఠాయి పొట్లం చిటారు కొమ్మను పట్టుకుని వేలాడే మిఠాయి పొట్లం కాదు. నేటి బాలబాలికల మెదడుకు పదునుపెట్టి, ఆలోచింపచేసే ఒక తాయిలం. బాలసాహిత్యం చెప్పుకోదగ్గ స్ధాయిలో రావడంలేదన్న విమర్శకుల అపవాదును ఈ పుస్తకం అపవాదుగనే మిగులుస్తుందనడంలో సందేహంలేదు. మౌఖిక సంప్రదాయమైన పొడుపు కథా ప్రక్రియను ఆధునిక జీవన విధానానికి అన్వయిస్తూ రాణీప్రసాద్‌ నిత్యజీవితంలో చూస్తున్న వస్తువులు, రోజూ గమనించే వివిధ అంశాలు, మానవ శరీరంలోని భాగాలు, వైజ్ఞానిక, సాంకేతిక అంశాలను చిన్నారులకు చక్కగా అర్ధమయ్యే రీతిలో చక్కని పొడుపు కథలుగారాశారు. చిట్టిపొట్టి మెదళ్ళకు సులభంగా అర్ధమయ్యే ఈ మిఠాయి పొట్లాన్ని బాలబాలికలకు తాయిలంగా అందిస్తున్నాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good