ఏకాదశి అంటే తిధితో సంబంధం లేదు: పదకొండు కథల సంపుటి అన్నమాట. శ్రీ మాన్‌ విద్యారణ్య స్వామి వారి పదిహేను ప్రకరణాల వేదాంత గ్రంథాన్ని పంచదశి అన్నారు.

కథ్‌ ధాతువుకు చెప్పడం అని అర్థం. దానిమీది నుంచి వచ్చిన కధాదిశబ్దాలు చెప్పడాన్ని బోధిస్తవి. కాబట్టి కథలు చెప్పుతూ వున్నట్టు తోచవలి. వాడుక భాషలో వుంటేనే తప్ప కథ చెప్పుతూ వున్నట్టు స్ఫురించదు. ఈ కథకుడు గోదావరి జిల్లావాడు కావడం చేత మధురమైన పదాలూ, వివిధ మండలాలలో విస్తారంగా సంచారం చేసినవాడు కావడం చేత రకరకాల మంచి పదాలూ తన కథలలో వాడినాడు. ఈ కథాదికములో భాష సలక్షణమై సాంప్రదాయ సిద్ధమైన తేట తెనుగు. ఇందులో జాతీయజీవనం ప్రతిబింబిస్తున్నది. కొమ్ములు తిరిగిన ఆంధ్రపండితులు పూర్వకాలం నుంచీ వచన రచనలో ఇలాంటి భాషే వాడేవారు. బడి పుస్తకాలలో భాష ఇలాంటిదే వుండేది. కొన్ని సంవత్సరాలు నుంచీ కొంత మందికి నిష్కారణంగా తేట తెనుగు మీద ద్వేషభావం కలిగింది. శ్రీరావుసాహెబ్‌ రామమూర్తి పంతులుగారి వ్యాసాలూ, ముఖ్యంగా వారి ఆంధ్ర గద్య చింతామణి సావధానంగా పఠిస్తే అపోషలు తొలగిపోతవి.

ఈ కథలలో నానాత్వము, చమత్కారిత్వమూ కనబడుతున్నవి. మన కథ, కధావకము, ఆఖ్యానకము, ఆఖ్యాయిక అనే విభాగాలకూ, ఇంగ్లీషు (టేల్‌, స్కెచ్‌) అనే విభాగాలకూ ఇంచుమించుగా సరిపోయేలాగున వుంటవి. దీక్షితులు వారి కథలు. కథా లక్షణాలు వుండడంచేత ఈ సంపుటిలో చేరింది వరూధిని.

Pages : 375

Write a review

Note: HTML is not translated!
Bad           Good