ఏ సృజనాత్మక రచనకైనా, ప్రవచనానికైనా ఏదో ఒక గొప్ప నేపథ్యం అదృశ్యంగా వుండటం సహజం. భారతీయ సమాజంలో ఆ నేపథ్యం - ఆధ్యాత్మిక సంపత్తి, ధార్మిక స్రవంతి.
ఆ రెండు యీ యుగంలో మహా విపత్తులో పడ్డాయి. రాళ్ళబండి వారి మాటల్లో వివరణ ఇవ్వాలంటే - ''అజ్ఞానం విజ్ఞానంగా, అశాంతి శాంతిగా, స్వార్థం పరమార్ధంగా, అహంకారం గౌరవ చిహ్న పతాకంగా చలామణీ అవుతున్నాయి.'' వాటికి ప్రతిఘటన లేదు. సాంఘీక దౌర్జన్యం, నిరంకుశ ప్రవర్తనలనూ - సాధారణమైన విషయాలుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చిత్రీకరిస్తున్నాయి. మన బాల బాలికలు యీ భయానక వాతావరణంలో పెరుగుతున్నారు. వాళ్ళకు మన సంస్కృతి, సాంప్రదాయాల గత వైభవం తెలియదు. యుగధర్మం మారిందంటున్నారు - మిడి మిడి జ్ఞానులైన - మన సాంస్కృతిక రంగ మిడియోకర్ నేతలు.
డా|| చిల్లర భవానీదేవి - తన అంతరంగం ప్రేరేపణలతో తన తపనకూ ఆవేదనకూ అభివ్యక్తీకరణే పరికరంగా, పాదరసం లాంటి ప్రాపంచిక అవగాహనలను ఒక రింగ్ సైడ్ సీట్ నుంచి తిలకించిన సుదీర్ఘ అనుభవ జ్ఞానంతో ఒక ప్రత్యక్ష సాక్షిగా, కాలరేఖమీద సాక్షి సంతకం చేస్తున్నది. ఆమె కవితా సంపుటాలకు పొడిగింపే ఈ కథా సంపుటి 'తాతామనవడు.కామ్'.
Rs.125.00
In Stock
-
+