శ్రీ కృష్ణదేవరాయల కథలు
సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల నాటి కథలు రమణీయం-రసరమ్యం. కవుల కళాకారుల సాహితీ ప్రాభవంతో స్వర్ణయుగ వైభవాన్ని సంతరించుకున్న కళల కాణాచి విజయనగర సామ్రాజ్యం. ఈ 'శ్రీకృష్ణదేవరాయల కథలు' సంపుటిలోని ప్రతి కథ ఓ ఆణిముత్యం.
హాస్యం, వ్యంగ్యం, ఆలోచన, తెలివి, చమత్కారం మొదలైన విశేష విశిష్టతల పరిణితిని పెంచే కథలు ఇవి. నటి కాలంలో కథలు  కథలుగా చెప్పబడినా నేటి కాలానికి ఇవి ఎంతో ఉపయుక్తం. ఆ బాలగోపాలానికి ఆనందదాయకం. కొన్ని గ్రంధస్తం, మరికొన్ని విని వున్నవి మొత్తం  అన్నింటినీ కలిపి ఓ పుస్తకంగా వెలువరించిన డా. వి.ఆర్.రాసాని  పాఠకలోకాన్నిమరిపిస్తారు.
చక్కని హాస్యాన్ని, తేలికైన పదాలతో, పొందికైన వాక్యాలతో చక్కని వ్యవహారికంలో అందించిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంటుంది. చదివి భద్రపరుచుకోవడమే కాదు, బహుమతిగా ఇవ్వదగిన ఉత్తమ కథ రాజం ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good