బాలల మానసిక వికాసానికి కథలు

తల్లిదండ్రులు పిల్లల మార్కులపట్ల, ర్యాంకుల పట్ల చూపుతున్న శ్రద్ధ వారిలోని సృజనాత్మకత పట్ల, మానసిక వికాసం పట్ల చూపటం లేదన్నది అసత్యం కాదు. పిల్లల్ని ఎంతసేపు పాఠశాల నాలుగ్గోడల మధ్య నిర్బంధించి, పాఠ్యపుస్తకాలకు పరిమితం చెయ్యాలని చూస్తున్నారు. పిల్లల్ని ఆట పాటలకు దూరం చేస్తూ మానసిక ఉల్లాసం లేకుండా చేస్తున్నారు. ఇంటా బయటా పిల్లల్ని ఒత్తిడి పెడ్తూ అశాంతికి గురిచేస్తున్నారు. దానివల్ల పిల్లలు మానసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారు. పెద్దవాళ్లు కేవలం పిల్లల భవిత గురించే కాదు! నడత గురించి కూడా ఆలోచించాలి.

పిల్లలు చదువులో చురుగ్గా వుండాలంటే ఆట పాటలూ వుండాలి. సాహిత్యం పట్ల, కళల పట్ల అభిరుచీ కలిగి వుండాలి. అప్పుడే పిల్లల్లో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. ఆత్మ విశ్వాసంతో, వ్యక్తిత్వవికాసంతో భవిష్యత్తుకు వాళ్లే బాటలు వేసుకోగలుగుతారు. సాహిత్య పఠనం ద్వారా పిల్లలు మానవీయ విలువల గురించి తెలుసుకోగలుగుతారు. - వల్లూరు శివప్రసాద్‌

''పిట్ట కథలు'' పిల్లల కథా సంపుటిలో పిట్టల కథ, పోరునష్టం - పొందులాభం, చిట్టమ్మ మొగుడు, శంభులింగం చెంబు, ఎత్తుకు పై ఎత్తు, లోకంతీరు, గుడ్డి గుఱ్ఱం, వ్యాపారుల కుయుక్తి, మానవజన్మ, పూనకం, గారెలు అనే 11 కథలు వున్నాయి.

పేజీలు : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good