డ్యర్డ్ కిప్లింగ్ 'జంగిల్ బుక్' రాసి నూటా ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ పుస్తకం అశేష పాఠకులను ఇంకా అలరిస్తూనే వుంది. ఇందులోని కథలన్నీ 1893-94 సంవత్సరాల్లో వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అనేక సంపుటాలుగా, చలన చిత్రాలుగా, యానిమేషన్ చిత్రాలుగా, నాటకాలుగా వెలువడ్డాయి. బాయ్ స్కౌట్ వంటి ఎన్నో సంస్థలు వాటిని వినియోగించుకున్నాయి. ప్రధానంగా మొగ్లీ చుట్టూ తిరిగే తొమ్మిది కథలను ఈ తెలుగు అనువాదంలో పొందుపరచడం జరిగింది.

కిప్లింగ్ కథనంలో పందొమ్మిదవ శతాబ్దపు ప్రకృతి చిత్రణ విధానం వ్యక్తమవుతుంది. మానవుల నియమాలకంటే ప్రకృతి నియమాలే ఎంతో ఉన్నతమైనవి అని చాటడం కనిపిస్తుంది. అడవిలో అజ్ఞానం, హింస కొంత ఎక్కువగా వున్నప్పటికీ మంచీ చెడు తెలిసిన, దేనినైనా ఎన్నుకునే స్వేచ్ఛ వున్న మానవ సమాజంలో వాటి పరిస్థితి మరీ దారుణం అంటారు. ఈ కథలు అడవిలో కాటగలసిపోయిన ఒక పసివాడికీ, మాట్లాడే జంతువులతో అతనికి ఏర్పడ్డ స్నేహానికీ సంబంధించిన కథలుగా పైకి అనిపిస్తాయి. కానీ ఎంతటి సమస్యలనైనా ఎలా ఎదుర్కోవాలో, స్నేహం ఎంత విలువైనదో చాటి చెప్పడమే వీటి ప్రధాన లక్ష్యం.
జంగిల్ బుక్ కేవలం పిల్లల పుస్తకమా?

కొన్ని పరిమితులతో ఆలోచించినప్పుడు మాత్రమే ఇది పిల్లల పుస్తకం అన్న భావన కలుగుతుంది. కానీ ఇది పిల్లలూ పెద్దలూ అందరికీ వర్తించే పుస్తకమని కిప్లింగ్ని అభిమానించే విజ్ఞులైన అనేక మందిపాఠకులు విశ్వసిస్తారు. బాల్యంలో ఈ కథలను చదివినవాళ్లు లేదా విన్నవాళ్లు పెద్దయిన తరువాత ఈ పుస్తకాన్ని మళ్లీ ఎంతో ఆసక్తిగా తిరగేస్తూ ఆనందించడం సర్వసాధారణం.

ఈ అద్భుతమైన కథలు పిల్లల్నీ పెద్దల్నీ ఆకట్టుకుంటాయి, అబ్బురపరుస్తాయి, ఆనందింపచేస్తాయి, ఆలోచింపజేస్తాయి. మళ్లీ మళ్లీ చదవాల్సిన కథలివి.
...

రడ్యర్డ్ కిప్లింగ్ (1865-1936) ఇంగ్లీష్ భాషనుంచి సాహిత్యంలో తొలి నోబుల్ బహుమతిని (1907) అందుకున్న

రచయిత. అతి చిన్న వయసులో నోబుల్ పురస్కారాన్ని పొందినవాడిగా ఆయన రికార్డు ఇప్పటికీ అలాగే వుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good