Rs.100.00
In Stock
-
+
శామ్యూల్ జాన్సస్
''చూడండి పిల్లలూ, మీకు ఇంకా తిండి తెచ్చిపెట్టే ఓపిక నాకులేదు. రెక్కలొచ్చాయిగా, ఎగరండి. మీకు నచ్చిన పసందైన ఆహారాన్ని మీరే తినిరండి. మన బలమైన కాళ్లతో జంతువుల్ని ఎలా అనాయాసంగా ఎగరేసుకు రావాలో మీకు నేర్పించాను గదా! వెళ్లండి. కోడిపిల్లన్ని ఎత్తుకు రావటం అన్నింటికన్నా సులభం. కుందేళ్లనూ పట్టుకు రావచ్చు. ఏ పొదల్లో ఎక్కడ దాగినా సరే ఇట్టే పొడిచి తీసుకురావచ్చు. చెట్టమీద కొమ్మల్లో, గూళ్లలో దాగిన అన్ని రకాల పక్షులూ మన పంజాల్లో చక్కగా అమరుతాయి. కానీ, పిల్లలూ, అన్నింటికన్నా రుచికరమైన భోజనం ఆహా! తలచుకుంటేనే నోరూరుతోంది. ఏమిటో తెలుసా? మనిషిమాంసం.
ఎన్నిసార్లు మీకోసం తెచ్చి గోరుముద్దలు చేసి తినిపించలేదూ''అంటూ కళ్లు మూసుకుని, జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, లొట్టలేసింది తల్లి రాబందు.....