రష్యన్‌ మహారచయిత లియో టాల్‌స్టాయ్‌ 1828 ఆగష్టు 28న యాస్నయా పొల్యానా గ్రామంలో పుట్టారు. జీవితంలో యెక్కువ భాగం అక్కడే గడిపారు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల కోసం చాలా కథలు రాశారు. ప్రపంచ సాహిత్యంలో రష్యన్‌ మహారచయిత టాల్‌స్టాయ్‌ తెలియని పాఠకుడు ఉండడు. వీరి ''అన్నాకెరినినా' ''వార్‌ అండ్‌ పీస్‌'' నవలలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. వీరికి గ్రీకు రచయిత ఈసప్‌ నీతి కథలంటే చాలా ఇష్టం. ఈసప్‌ నీతి కథలని టాల్‌స్టాయ్‌ ఒకోసారి సామెత రూపంలో మరోసారి జానపద కథారూపంలో లేదా నిత్య జీవత వ్యవహారానికి దగ్గరగా వుండేలా చెప్పారు. కథా నేపథ్యాన్ని ఆయన తన మాతృదేశానికి మార్చారు. దాంతో వాటికి టాల్‌స్టాయ్‌ సొంత ముద్ర, రష్యన్‌ నీతి కథల రూపం వచ్చింది. ఈ కథల్లో అన్ని రకాల పాత్రలు - మానవులు, దేవతలు, జంతువులు వున్నాయి. కాని పాత్రలు యెలాంటివైనా, వాటిద్వారా రచయిత పిల్లలతో మాట్లాడినట్లు వుంటుంది. అందువల్ల ఆ పాత్రలు ముసుగు తగిలించుకున్న పిల్లల్లా కనిపిస్తాయి. మధ్య మధ్య ఆ ముసుగు తొలగిపోతుంది. అపుడు సంతోషంతో మిలమిల మెరిసే వారి నేత్రాలు కనిపిస్తాయి. ఈ కథల్ని పెద్దలు చదివి పిల్లలకి చెబితే పిల్లల్లో భాషాజ్ఞానం, సృజనాత్మకత, జ్ఞాపకశక్తి పెరగడమేకాక మంచి గుణాలు అబ్బుతాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good