ఈ 'బాలల సముద్రశాస్త్రం నాలుగవ భాగం'లో డాక్టర్‌ రెడ్డిగారు భవిష్యత్తులో మానవాళి ఎదుర్కొన బోవు మూడు ప్రధాన సమస్యలను సముద్రాలు ఎలా పరిష్కరింపగలవో శాస్త్రీయంగా వివరించారు.  సముద్రాల అలల నుండి విద్యుచ్ఛక్తిని ఉత్పాదన చేయు పద్ధతులను, డిశాలినేషన్‌ విధానంలో సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేసి, త్రాగునీటిని ఉత్పత్తి చేయు విధానాన్ని, మానవాళికి ఆహార వనరులైన చేపలను, రొయ్యలను అత్యధికంగా సమకూర్చుకొనే అవకాశాలను గురించి విపులంగా చర్చించారు. అందుకు ఉపయోగపడే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి గూడ సమగ్రంగా వివరించారు.  ఇందులో ఉన్న విషయపు లోతు దృష్ట్యా, ఇది ప్రయోగాలకు, పరిశోధకులకు ఉపయోగపడే అంశం గనుక ఈ సంపుటాన్ని 'సముద్రశాస్త్రం' అనే పేరుతో ప్రచురించారు.

Pages : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good