రాయలసీమ అంటే శ్రీ కృష్ణ దేవరాయలు పరిపాలించిన సీమ. ఈ ప్రాంతంలో ఒకప్పుడు వజ్రాలు, వైడూర్యాలు మణులు బాగా లభించేవట.అందుచేత  ఈ ప్రాంతాన్ని రతనాల సీమ అనికూడా అంటారు. అంతేకాక బ్రిటిష్ వారి కాలంలో దీనిని దత్త మండలం అనేవారు. రాయల సీమ జిల్లాలో ఎందరో మహామహులు జనించి తెలుగుజాతిని ప్రభావితం చేశారు. ఇందు..ఇలా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి వారిలో నీలం సంజీవ రెడ్డి గారు ఒకరు. రైతు బిడ్డగా ఒక గ్రామంలో జనించి. పట్టుదల , దీక్షతో దేశంలో అత్యున్నత పదవి అలంకరించారు. పదవుల నిర్వహణలో , పాలలనో , సాటివారికి సాయం అందించడంలో తనకు తానే  సాటి అనిపించుకున్నారు.సంజీవరెడ్డి గారి జీవిత విశేషాలు పరిచయం చేసుకుంటే 20 వ శతాబ్ది రాజకీయ చరిత్ర పూర్తిగా తెలుస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good