ఒకే భావజాలం నుండి వచ్చిన ముగ్గురు జాతీయ నాయకులు అటల్‌ బిహారి వాజపేయి, లాల్‌కృష్ణ అద్వాని, నరేంద్ర మోడిల జీవిత చరిత్రలను ఒకే సంపుటంగా వెలువరిస్తే తులనాత్మకంగా విశ్లేషించుకోవటానికి, పాఠకులకు, ముఖ్యంగా యువతరానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ''నాయకత్రయం'' పేరుతో ఈ గ్రంథాన్ని మీముందు ఉంచుతున్నాను. ఇందులో పొగడ్తలు తెగడ్తలు లేవు. వీరి కథ ఇది అని చెప్పటం మాత్రమే జరిగింది. పార్లమెంటరీ అధికార భాషా సంఘం ఉపాధ్యక్షుడిగా, అటల్‌ బిహారి వాజపేయి, అద్వానీగార్లతో 6 సంవత్సరాలపాటు దగ్గరగా పనిచేసే అవకాశం నాకు కలిగింది. కేంద్రీయ హిందీ సమితి సభ్యునిగా ప్రధాని నరేంద్ర మోడిగారితో పనిచేసే అవకాశం కలిగింది. అది కొంతవరకు ఈ గ్రంథ వెలువరించటానికి ప్రేరణ. - యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good