గాంధీజీ కేవలం స్వాతంత్య్రోద్యమ నేత మాత్రమే కాదు. ఆయనలో బహుముఖీనత వుంది. రచయితగా, జర్నలిస్ట్‌గా, శ్రామికనేతగా, చివరకు ఖైదీగా, రైలు ప్రయాణీకుడుగా కూడా గాంధీజీ ఒక విలక్షణమైన దృక్పథాన్ని కనబరిచారు. ఇక, - ఆయన ఆర్థిక దృక్పథం సంగతి సరేసరి. ఇలా - విభిన్న రంగాలలో కనబడే విలక్షణమైన గాంధీజీ ముద్రను గురించి ఆలోచించేవారు తక్కువ. ఈ రంగాలలో కూడా మనం గమనించవలసిన విషయాలు చాలా వున్నాయని తెలియజెబుతూ ఈ పుస్తకం రాశాను. ఇది చిరకాలంగా మనం గాంధీజీని చూస్తున్న దృష్టికోణం కాదు కాబట్టి - దీనికి 'మరో కోణంలోంచి మహాత్ముడు' అనే మకుటాన్ని వుంచాను.

గాంధీజీకి నోబెల్‌ శాంతి బహుమతి ఎందుకు రాలేదని చాలా సభల్లో పలువురు శ్రోతలు ధర్మ సందేహాన్ని నన్ను చిరకాలంగా అడుగుతూ వచ్చారు. పాఠకులలో కొందరికి కూడా ఈ సందేహం వుండవచ్చునేమో అనే ఉద్దేశంతో ''గాంధీజీ-నోబెల్‌ బహుమతి'' అనే వ్యాసాన్ని ఈ పుస్తకంలో రాశాను.

అలాగే - గాంధీజీని మార్టిన్‌ లూథర్‌కింగ్‌ ఎలా అనుసరించాడు, ఎంతవరకూ అనుసరించాడు, అనేది కూడా గాంధీపట్ల ఆసక్తి వున్నవారికి తెలుసుకోదగ్గ అంశమే. అందుచేత ఆ వ్యాసాన్ని కూడా ఈ పుస్తకంలో చూడవచ్చు...

- కోడూరి శ్రీరామమూర్తి

Write a review

Note: HTML is not translated!
Bad           Good