మన కథ విదేశాలలో మొదలవుతుంది.

యూరపు ఖండాన్ని మనం పరిశీలించి చూస్తే ఎన్నో దేశాలు కనిపిస్తాయి. వాటిల్లో యుగోస్లావియా ఒకటి. పడమటి వైపు ఏట్రియాటిక్‌ సముద్రం ఉంటుంది. ఇది మధ్యధరా సముద్రానికి చెందింది.

ఏట్రియాట్రిక్‌ సముద్ర తీరం సశ్యశ్యామలం అయినది. అటువంటి యుగోస్లావియాలో 'స్కాప్‌జీ' అనే పట్టణం ఉన్నది. మన కథ మొదలయినప్పుడు అదొక చిన్న పట్టణమే! దాదాపు 25 వేల పైచిలుకు జనాభా ఉండేది. స్కోప్‌జీ అల్బేనియాలో  ఉండేది. అంతకు ముందు అల్బేనియా టర్కీ పాలనలో శతాబ్దాల తరబడి ఉన్నది. టర్కీ ఇస్లామ్‌ రాజ్యం. అంటే ఇస్లాం పాలనలో ఉండేదన్న మాట.

స్కోప్‌జీ పట్టణంలో అల్బేనియా దంపతులు ఉండేవారు. పురుషుని పేరు 'నికలస్‌ బొజాక్సియొ' భవనాలు నిర్మించే కాంట్రాక్టరు. ఆయన భార్య పేరు ''డ్రానా ఫైల్‌ బెర్నయ్‌'' వెనిస్‌, ప్రాంతానికి చెందిన స్త్రీ.

ఆ దంపతులకు 1910 ఆగష్టు 27వ తేదీన మూడవ బిడ్డ జన్మించింది. ఆమెకు ''ఏగ్నేస్‌'' అని పేరు పెట్టుకున్నారు. ఆ అమ్మాయి అక్క ఏజ్‌, అన్న లాజర్‌. ఆ అమ్మాయి పూర్తి పేరు ''ఏగ్నేస్‌ గోంజా బొజాక్సియో'' వారిది మధ్య తరగతి కుటుంబం. తండ్రి చేసే వ్యాపారంతోనే కుటుంబం గడిచేది.

పేజీలు : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good