కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు గారు కృష్ణ జిల్లాలోని ఎలకుర్రు గ్రామములో జన్మించారు. కృషి, దీక్ష పట్టుదలతో వివాహానంతరం కూడా విద్యాభ్యాసము కొనసాగించారు. అటు పిమ్మట ముంబై మహానగరానికి వెళ్లి అక్కడి జన సముద్రంలో ఆటుపోట్లను ఎదుర్కన్నారు. అమృతాంజనాన్ని తయారుచేసి అమ్మకాన్ని కొనసాగించారు . అమృతాంజనాన్నివీరికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. కొంత ధనార్జ న చేసిన పిదప కాశీనాధుని వారు ఆంధ్ర పత్రికకు అంకురార్పణ చేసారు. ఆంధ్ర పత్రిక సంవత్సరాది సంచికలను ప్రారంభించారు. ప్రతి ఏడాది ఉగాది నాడు అద్బుతంగా రంగుల ముఖచిత్రాలతో సంత్సరాది సంచికలను విడుదల చేసారు. |