పత్ర హరితం! పత్ర భరితం!

ఆకులులేని చెట్టునీ ఊహించలేం! చెట్లు లేని ప్రకృతినీ

ఊహించలేం! మానవజన్మేలేని మానవత్వంలా

వుంటుంది!

        మన ప్రాణం తీసే వాయువుని తాను తీసుకుని మనకు

ప్రాణం పోసే వాయువుని యిస్తుంది మాను.

అది మాను తత్వం!

పసితనపు నునుపుతో, నునులేత చిగురుతో

వెలుతురుతో వెలుగులు పంచి, ముదురు రంగులోకి

మారి, తరు అంగ తరంగమై ఆడి, వయసు వాడి,

ఎండి రాలి పడి, ఆఖరి అణువు దాకా ఏదో ఒక

ప్రయోజనాన్నిస్తూనే వుంటుంది ఆకు!

మనసున్న మనిషిలో మంచి మాటను నాటుతుంది.

భావుకతను భావ కవితా లతలతో అలరిస్తుంది.

అంతులేని అందాల ఆకారాలతో!

అనునిత్య సత్య సుందర సందేశాలతో!

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good