ఎంతో డబ్బు వెచ్చించి, ఎన్నో రోజుల తరబడి ప్రాక్టీస్‌ చేసి, లగేజీలతో, అసిస్టెంట్ల సాయంతో ఆడిటోరియం వరకు మోసుకెళ్ళి, ప్రదర్శనలిచ్చి ఫెయిల్‌ అయిన మెజీషియన్స్‌ వున్నారు.
మీరలా కాకుండా సమాజంలో మీకో ప్రత్యేకతతో పాటు 'శభాష్‌' అనిపించుకోవాలనుంటే
వెంటనే ''నూటొక్క తమాషా' పుస్తకం చదవండి. ఎక్కడయినా చీట్ల పేకలు పొంది, జేబులో పెట్టుకోండి.
పిక్‌నిక్స్‌లో, ఫంక్షన్స్‌లో, బోర్‌కొట్టి విసుగెత్తిన వేళల్లో వినోదంగా, విరామ సమయాల్లో చివరికి పరుగెత్తే రైల్లో కాలక్షేపంగా మీ బంధు మిత్రుల ముందు ప్రదర్శించి మనోరంజనం కల్గించి భలేవారనిపించుకోండి.
అయితే ఒక్కమాట. ట్రిక్కులు మరచిపోయినా ఫర్వాలేదుగాని ఈ బుక్కు మాత్రం చేతులు మారకుండా దాచుకోండేం! - జోషి

Write a review

Note: HTML is not translated!
Bad           Good