ప్రపంచ సాహిత్యంలో అరేబియన్‌ నైట్స్‌ కథలకు ఒక ప్రత్యేకమైన స్ధానముంది. వీటినే వేయిన్నొక్క రాత్రులు అనీ, అరబ్బీ రాత్రులు అనీ యవ్వన యామినీ వినోదాలనీ వ్యవహరిస్తుంటారు. ఇవి అరబ్బీ భాషలో 'అలఫ్‌లైలా వలైలా' పిలవబడుతున్నాయి.

ఈ కథళు స్త్రీ పురుషులకు, పండిత పామరులకు గూడ ఎంతో వినోదాన్ని కలిగించేవిగా, ఆశ్చర్యచకితుల్ని చేసేవిగా రచింపబడి శతాబ్ధాల తరబడి ప్రపంచంలో అధిక ప్రాచుర్యాన్ని పొందాయి. ఇవి ఏక కవి విరచితమైనవి కావనీ, బహుళ కవుల కృషి ఫలితమేనని విజ్ఞులంటారు. ఈ కథా సంపుటి యొక్క మాతృక అరబ్బీ భాషలో వ్రాయబడింది. దానిని జె.సి. మార్డరస్‌ ఫ్రెంచి భాషలోనికి, పలిస్‌ మాథర్స్‌ ఫ్రెంచి నుండి ఆంగ్లంలోనికి అనువదించారు. ప్రస్తుత సంపుటిని శ్రీ ఘంటికోట బ్రహ్మాజీ రావుగారు ఆంగ్లము నుండి తెలుగులోనికి సమగ్రంగా అనువదించారు.

శ్రీ బ్రహ్మాజీరావుగారు వివిధ ఆంగ్ల రచనలను పరిశీలించి వాటిలోని విశిష్టతనూ భావుకతనూ వ్యక్తపరుస్తూ సమగ్రమైన అనువాదంగా రూపొందించారు. అందులకు వారెంతో ప్రశంసనీయులు.

ఈ కథలలో అద్భుత సాహసకృత్యాలు, ఇంద్రజాల మహేంద్రజాలాలు, సరస శృంగార వర్ణనలు, నవరసభరిత జీవన విధానాలూ ఆసక్తిదాయకంగానూ, శ్లాఘనీయంగానూ మలచబడ్డాయి. ఇవి చదువరులకెంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఉత్సుకతను కలిగించి పదేపదే చదవాలనే కోరిక కలగజేఆ్తయనడంలో సందేహం లేదు. ఈ కథలలో అశ్లీల శృంగారం అక్కడక్కడా కొంచెం హెచ్చుమోతాదులోనే వాడబడింది. వీటిని రస ధృష్టితోనే చదవి ఆనందించాలి. పాఠకుల సౌకర్యార్ధం ఈ సంపుటిని రెండు భాగాలుగా ప్రకటిస్తున్నప్పటికీ - కావలసినవారు రెండు భాగాలూ ఒకే మారు తీసుకోవలసి ఉంటుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good